![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ సజ్జ ఇప్పుడు పెద్దవాడైపోయి హీరోగా "హనుమాన్" అనే మూవీలో నటించాడు. అలాగే కామెడీ కూడా కాస్తా ఎక్కువగానే చేసాడు. సుమకు కౌంటర్ లు కూడా వేసాడు. ఇక ఈ వారం షోకి హనుమాన్ మూవీ టీమ్ తేజ సజ్జ, అమృత అయ్యర్, ప్రశాంత్ వర్మ, గెటప్ శీను వచ్చారు. ఇక సుమా ఈ టీమ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు "ఇప్పటి వరకు వచ్చిన సూపర్ హీరో ఫిలిమ్స్ లో మీ సూపర్ హీరో ఎవరు" అని సుమ ప్రశాంత్ వర్మని అడిగేసరికి "హనుమాన్" అని ఆన్సర్ ఇచ్చాడు. "అబ్బా ఫస్ట్ మన సినిమాను మనం ప్రేమిద్దాం..తర్వాత సంగతులు తర్వాత.." అని కౌంటర్ వేసింది సుమ.
"హనుమాన్ అని ఉంది కదా డివోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుందా మూవీలో" అని సుమ తేజని అడిగేసరికి "పండక్కి ఫామిలీ మొత్తం వెళ్లి చూసే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అందులో దేవుడి ఎలిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది" అని తేజ చెప్పేలోపు "రొమాన్స్ ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే హనుమాన్ కదా" అని సుమ కౌంటర్ వేసింది దానికి "రొమాన్స్ అనేది మా ఇద్దరి సినిమాల్లో ఉండదు" అని తనను, ప్రశాంత్ వర్మని కలిపి చెప్పాడు తేజ. ఆ కౌంటర్ కి సుమ షాకయ్యింది. "అవును కదా ఎందుకలా" అని సుమ అడిగేసరికి "ఎందుకంటే ఆయనకు నాకు రొమాన్స్ చేయడం రాదు" అని చెప్పాడు తేజ. ఇక ప్రశాంత్ వర్మ నోరు విప్పు "నాకు అర్ధమయ్యింది కానీ బబుల్ గం అంత వయొలెంట్ ప్రేమ కాదు" అని చెప్పాడు. ఇక ప్రశాంత్ వర్మ కామెంట్స్ రూటు మారుతోందని తెలిసి సుమ టాపిక్ ని గెటప్ శీను వైపు మళ్లించింది "ఈయన జాంబీ రెడ్డిలో జాంబీగా బాగా యాక్ట్ చేసాడు ఎందుకంటే ఆ దెయ్యం పోలికలు అవి చాలా కరెక్ట్ గా పెట్టగలడు" అనేసరికి అందరూ నవ్వేశారు.
![]() |
![]() |